Search This Blog

11 March 2017

Ravinuthala Village From 29th onwards tiger will ready to roar

3 March 2017

అసెంబ్లి

Ravinuthala Village 192 రోజుల్లో నిర్మాణం పూర్తి చేయడం రికార్డ్‌: కోడెల!!! చట్టసభలకు నవ్యాంధ్రలో నాంది పలుకుతున్నామని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులను అభినందిస్తున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణంలో రైతుల పాత్ర మరువలేనిదన్నారు. 192 రోజుల్లో భవనాల నిర్మాణం పూర్తి చేయడం రికార్డ్‌ సృష్టించిందని అన్నారు. సీఆర్డీఏ, ఎల్‌అండ్‌టీ వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. మనగడ్డపై సభ నిర్వహించుకోవడం గర్వకారణమని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మేం కృషి చేస్తామని అన్నారు. ఈనెల 6 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయని ఈ సంధర్భంగా తెలిపారు. రాజకీయ లబ్దికోసం చట్టసభలను ఉపయోగించుకోవద్దు: యనమల!!! ప్రజల మనోభావాలకు అనుగుణంగా చర్చలు జరగాలని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.పార్టీల వ్యక్తిగత వ్యవహారాలపై చర్చలు సరికాదని ఆయన అన్నారు. రాజకీయ లబ్దికోసం చట్టసభలను ఉపయోగించుకోవద్దని అన్నారు. ప్రతిపక్షాలు ఈ కార్యక్రమానికి హాజరైతే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలు చర్చించే వేదికగా చట్ట సభలు నిలవాలని అందుకు అందరం కట్టుబడి పని చేద్దామని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన ప్రాంతం అమరావతి అని అన్నారు. దక్షిణాసియా దేశాలకు వాణిజ్య పట్టణం అమరావతి ఆయన గుర్తుచేశారు. అసెంబ్లీని అత్యంత వేగంగా నిర్మించాం: మంత్రి నారాయణ!!! ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీని అత్యంత వేగంగా నిర్మించామని, చంద్రబాబు దిశా నిర్దేశంతో...రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూడా అంతే వేగంతో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. గురువారం శాసనసభ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాజధాని భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని అన్నారు. రాజధానికి భూములిచ్చి రైతులు త్యాగం చేస్తే..అడ్డుకునేందుకు కొందరు కుట్రలు పన్నారని మంత్రి నారాయణ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రైతులు పండించిన పంటలను కూడా తగులబెట్టారని నారాయణ మండిపడ్డారు.

మెరిసిన మిణుగురులు

Ravinuthala Village మన రావినూతల అందగాడు రఘు బాబు గారు నంది అవార్దు గెలుచుకున్న సందర్బంగా శుభాభినందనలు