Search This Blog

31 March 2016

తండ్రి ఆశయ సాదనె లక్ష్యం గా ముందుకు సాగుతున్న పరిటాల శ్రీరాం


అప్పుడు రాయలసీమ పగలతో, ప్రతీకారాలతో అణు నిత్యం రణరంగాన్ని తలపించేంది. వర్గ పోరు, రాజకీయ కొట్లాటలు అక్కడ సర్వసాధారణం. అలాంటి సమయంలో ప్రజల పాలిత దైవం లా వచ్చాడు. ప్రజలను క్షోభకు గురిచేసే వారిపట్ల ఉప్పెనలా దూకాడు. ప్రజల కష్టాలను తీర్చే మనసు, సామాజిక సమస్యలపై సంపూర్ణ అవగాహన, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకువచ్చే సేవాగుణం ఆయన సొంతం. అన్యాయాన్ని ఎదురించడంలో, అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపడంలో వెన్ను చూపని ధీరుడు. అత్యంత చిన్న వయస్సులో రాజకీయ పాఠాలను నేర్చిన ఘన చరిత్ర. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం, దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన ఘనత ఇప్పటికే మీకు ఆర్థం అయిపోయి ఉంటుంది ఆయన ఎవరో..! అవును మీ మనసులో ఎవరితే ఉన్నారో ఆయనే ఆయన. వారు మరెవరో కాదు పరిటాల రవి.

ఈ పేరు వింటేనే శత్రువుల గుండాలు సగం జారిపోతాయి. ఈ పేరు వింటేనే ప్రతిపక్షం గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఆయన వార్ మొదలుపెడితే ఆ వార్ వన్ సైడ్ అయిపోతుంది. ఆ సమస్య ఎలాంటిదైనా టీ తాగే సమయంలో దాన్ని పరిష్కరించే నేర్పు ఆయన సొంతం.  అంతటి రాజకీయ ఓర్పు, నేర్పు కలిగన వ్యక్తి మన పరిటాల రవి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ ను సైతం మంత్ర ముగ్ధుల్ని చేసిన ఆయన శైలి అత్యద్భుతం. తెలుగుదేశం తొలి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అంతటి పాత్రను పోషించింది పరిటాల రావే. ఆయన్ని ఎన్నో మంత్రిపదవులు వరించాయి. ఆయన రాజకీయాల్లో చేరి ప్రజల పాలిట ప్రత్యక్ష దైవంగా మారాడు.

కానీ.. కుళ్లు, కుతంత్రాలతో నిండిన రాజకీయాలు ఆయన్ని పొట్టన బెట్టుకున్నాయి. ఆ తర్వాత ఆయన భార్య పరిటాల సునీత భర్త అడుగుజాడల్లో నడవాలని రాజకీయ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆవిడకి ఒక తనయుడు ఉన్నాడు ఆయనే పరిటాల శ్రీరామ్. ఆయన ఇప్పుడు యుక్తవయస్సుకు చేరుకున్నాడు. ఆయన కూడా తఃన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనే సంకల్పంతో రాజకీయ అరంగేట్రం చేయడానికి సమాయత్తమవుతున్నారు. దీనికి పరిటాల సునీత ప్రోద్భలం తోడవ్వడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం కుదిరింది.


పరిటాల రవి రాజకీయంలో ఉన్న సమయంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జరిపి ప్రజల ఆదరాభిమానాలను సైతం చూరగొనేది. ఆయన జరిపిన ఎన్నో కార్యక్రమాలకు సైతం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం హాజరు అయ్యేవారు. ఇప్పుడు అదే బాటలో తన తనయుడు శ్రీరామ్ సైతం పయనించాలనుకుంటున్నారు.

రిటాల రవి సతీమణి, శ్రీరామ్ తల్లి మంత్రి సునీత సహకారంతో చేపట్టబోతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21న ఏర్పాటుకానున్న ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి. కరువు పరిస్థితుల కారణంగా అనంతపురం జిల్లాలో కూతుళ్ల పెళ్లిళ్లు చేయడం పేద తల్లిదండ్రులకు భారంగానే మారింది. ఈ నేపథ్యంలో అనేక మంది సామూహిక వివాహాల కోసం తమ పేర్లను నమోదు చేసుకొంటున్నారు.

పెద్దల అంగీకారంతో సజావుగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో జంటకు 10వేల రూపాయల ఖర్చుతో చీర, తాళిబొట్టు, ఇతర సామాగ్రిని పరిటాల శ్రీరామ్‌ సమకూర్చుతున్నారు. పెళ్లికొడుకుల కోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా దుస్తులు తెప్పిస్తున్నారు. ధర్మవరంలో 10టన్నుల లడ్డూలకి కూడా ఆర్డర్‌ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, జిల్లాలో పరిటాల శ్రీరామ్‌ ఎదుగుదలను కొందరు తెలుగుదేశం నేతలు అడ్డుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సేవా కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రికి ఆయన దగ్గరవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. అంతేగాక, సీఎం తనయుడు లోకేశ్‌కు కూడా టచ్‌లో ఉంటున్నట్లు తెలిసింది. పరిటాల సునీత సైతం అన్ని కార్యక్రమాలకు కొడుకుని ముందుంచి నడిపిస్తున్నారట.

పుట్టిన ఊరికొసం రాత్రనక పగలనకా ...!


రావినూతల  గ్రామ ప్రజలు వెసవి లొ నీటి కొరత లెకుండా ఇన్జన్లతొ గ్రామ చెరువులను నింపెస్తున్నారు

ఆ ద్రుశ్యాలు.......

రోజా జూనియర్ గురించి అలా అనడానికి కారణం ఏమిటి..?




వైకాపా నుంచి సంవత్సరం పాటు బహిష్కరణకు గురైన రోజా పిటిషన్ పై హైకోర్ట్ లో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోజా సినినటుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. జూనియర్ 2009లో ప్రచారం కోసం వాడుకున్నారని, జూనియర్ ప్రచారం సమయంలో అభిమానులు, కార్యకర్తలు భారీ తరలి రావడంతో.. జూనియర్ కు ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఎన్నికల అనంతరం ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టిందని రోజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
రోజా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి అని ఒకసారి పరిశీలిస్తే.. ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమైన వ్యక్తి కొడాలి నాని. మొదటి నుంచి నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు నాని వైకాపాలో చేరారు. గుడివాడ నియోజక వర్గం నుంచి నాని విజయం సాధించాడు. దీంతో నానికి, తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇక, ఇటీవలే రోజాతో పాటు నానిని కూడా సభ నుంచి సస్పెండ్ చేసింది అసెంబ్లీ. అయితే, అటు ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీకి ఎలాగో ఎన్టీఆర్ కూడా దూరంగా ఉండటంతో.. ఎన్టీఆర్ ను తనవైపు తిప్పుకోవాలని వైకాపా చూస్తున్నదా అనే అనుమానం కలుగుతున్నది. అటు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండటంతో.. వైకాపాకు కూడా చరిష్మా కలిగిన నేత అవసరం కాబట్టి జూనియర్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలలో భాగంగానే రోజా చేత ఇలా చెప్పించి ఉంటారా అనే అనుమానం కలుగుతున్నది. ఇందులో నిజం ఎంత అన్నది మాత్రం స్పష్టంగా తెలియదు.

29 March 2016

MLA & MLC Salaries Hit A Triple

Telangana Government decided to give a hike in salaries MLAs and MLCs and Telangana legislative affairs minister Harish Rao introduced the respective bill in Assembly on Monday. 


The legislators salaries were proposed to be tripled and they will be getting 2.30 lakh rupees instead of 83,000 rupees according to the new amendment. If the raise in salaries goes an act, then government will be burdened with an extra 42.67 crore rupees annually and Tuesday will witness a discussion on this in Assembly. 

An MLA or MLC at least for once will get a pension of 30,000 rupees and for those who were legislators more than once will get an extra 1000 rupees per month and up to a maximum of 50,000 rupees per month. 

CM's salary will be 2.44 lakh rupees adding all the allowances and ministers can get up to 2.52 lakh rupees. The detailed pay for ministers comprises of 14,000 in basic, 8,000 special allowance, camp office allowance 10,000, bulletproof car allowance 25,000, own car allowance 30,000, fuel allowance 15,000, house rent allowance of 50,000 rupees and others.

REVANTH REDDY Vs KTR



రెండు భిన్నధ్రువాల్లాంటి రాజకీయ నేతల మధ్య మాటలు చాలా తక్కువగా ఉంటాయి. రాజకీయాల్ని కాసేపు పక్కన పెడితే.. ఒకరికొకరు ఎదురెదురు పడినప్పుడు వారు ఎలా ఉంటారు? ఏమని పిలుచుకుంటారు? ఎలా మాట్లాడుకుంటారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్.. తెలంగాణ రాష్ట్ర సర్కారులో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత పవర్ ఫుల్ అయిన మంత్రి కేటీఆర్ లాంటి రెండు భిన్నధ్రువాలు ఒకచోట కలిసినప్పుడు వారి మధ్య ఎలా ఉంటుందన్నది సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకుంది.

అసెంబ్లీ లాబీలో లిఫ్ట్ దగ్గర టీటీడీపీ నేత  రేవంత్ వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి మంత్రి కేటీఆర్ వచ్చారు. రేవంత్ ను చూసిన వెంటనే.. ఏం భయ్యా .. వ్యూహాత్మకంగా వెళుతున్నట్లున్నావే? అంటూ నవ్వుతూ పలుకరించారు. దీనికి ప్రతిగా రియాక్ట్ అయిన రేవంత్.. వెళ్లాలి కదా.. స్ట్రాటజీ లేకపోతే ఎలా అన్నా? అంటూ బదులిచ్చారు. దీంతో కేటీఆర్ నవ్వుతూ రేవంత్ భుజం తట్టి వెళ్లిపోయారు. రాజకీయంగా ఎన్ని తిట్లు తిట్టుకున్నా.. వాదనల సందర్భంగా ఎంతగా విభేదించుకున్నా.. ఒకచోట కలిసినప్పుడు మాత్రం రాజకీయ వైరుధ్యాలకు భిన్నంగా పలుకరించుకోవటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.

100 కొట్లా కావల్సిందీ......



రాజకీయాలు చాలా కాస్ట్టీగా మారిపోయాయి. సాధారణ బ్యాక్ గ్రౌండ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారు కూడా కోట్లకు అధిపతులైపోతున్నారు. అసలు కోట్లు సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తున్నవారూ ఉన్నారు. అందుకే ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా.. సీనియర్ అయినా, జూనియర్ అయినా... నోరు విప్పితే చాలు వందల కోట్లు, వేల కోట్ల లెక్కలే వినిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూతో కలిసి టీడీపీలో చేరుతారని భావిస్తున్న రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి తనకు టీడీపీ నేతలు 20 కోట్లు ఇస్తామన్నారని సంచలన ప్రకటన చేశారు. అయినా, తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదన్నారు.

 మరోవైపు విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అంతకంటే పెద్ద పెద్ద మాటలు వినిపిస్తున్నారు. తనకు 100 కోట్లు ఇచ్చినా కూడా వైసీపీని వీడనని ప్రకటించారు. ''టీడీపీ ఎప్పటికైనా మునిగే పడవ. ఆ పార్టీలోకి పోయి ఏం చేయాలి? అలా చేస్తే జనాలు ఛీ కొడతారు'' అని ఈశ్వరి అంటున్నారు. టీడీపీ 'ఆకర్ష'పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నేతలు యత్నించారని, అందుకు వారు రూ.20 కోట్లు ఎరగా వేశారని ఆమె ఆరోపించారు. రూ.20 కోట్లు కాదు కదా, రూ.100 కోట్లిచ్చినా తాము వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. వైసీపీని దెబ్బకొట్టేందుకే టీడీపీ కుట్రలు చేస్తోందిని ఆరోపించారు. గిరిజన బిడ్డలమైన తాము వైఎస్ జగన్ వల్లే అసెంబ్లీలో అడుగుపెట్టగలిగామని ఆమె చెప్పారు. 

 అయితే... ఈ మహిళా ఎమ్మెల్యేల మాటలు విన్న రాజకీయ పండితులు మాత్రం ''ఆడవారి మాటలకు అర్థాలు వేరులే'' అని పాటలు పాడుకుంటున్నారు.

ఫాక్షన్ పడగ విరిచిన భూమా ఆదిపత్య పొరు


Image result for faction rayalaseema


అసలే అవి కత్తులు... ఒకే ఒరలో ఎలా ఇముడుతాయి. ఇప్పుడు కర్నూలు టీడీపీలో ఇదే ప్రాబ్లం వచ్చింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో కొనసాగుతున్న మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. రీసెంటుగా శిల్పాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న కొత్తపల్లి సర్పంచ్ తులసిరెడ్డిపై భూమా వర్గీయులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. తులసిరెడ్డి కోసం మాటు వేసిన భూమా వర్గానికి చెందిన బాలనాగిరెడ్డి, మరికొంత మంది... ఆయన కళ్లల్లో కారం చల్లి ఇనుప రాడ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన తులసిరెడ్డిని తొలుత కర్నూలు జనరల్ ఆసుపత్రి, ఆ తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తులసిరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.

 కాగా దాడిపై వెనువెంటనే స్పందించిన తులసిరెడ్డి వర్గీయులు భూమా వర్గమే ఈ దాడికి పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమా అనుచరుడు బాలనాగిరెడ్డి సహా 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారికోసం గాలింపు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే, ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శిల్పా మోహన్ రెడ్డి... తులసిరెడ్డిపై భూమా వర్గమే దాడి చేసిందని ఆరోపించారు. అంతేకాక ఈ దాడికి సంబంధించి భూమా వర్గంపై పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన పేర్కొన్నారు.

 మరోవైపు ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా భూమా వర్గం వాదిస్తోంది. పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగి ఉండొచ్చని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని ఆ వర్గం చెబుతోంది. ఈ దాడితో నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొత్తపల్లిలో తులసిరెడ్డి వర్గీయులు ఎక్కడ ప్రతిదాడులకు దిగుతారోనన్న అనుమానంతో పోలీసులు కొత్తపల్లిలో పికెట్ ఏర్పాటు చేశారు.