
అప్పుడు రాయలసీమ పగలతో, ప్రతీకారాలతో అణు నిత్యం రణరంగాన్ని తలపించేంది. వర్గ పోరు, రాజకీయ కొట్లాటలు అక్కడ సర్వసాధారణం. అలాంటి సమయంలో ప్రజల పాలిత దైవం లా వచ్చాడు. ప్రజలను క్షోభకు గురిచేసే వారిపట్ల ఉప్పెనలా దూకాడు. ప్రజల కష్టాలను తీర్చే మనసు, సామాజిక సమస్యలపై సంపూర్ణ అవగాహన, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకువచ్చే సేవాగుణం ఆయన సొంతం. అన్యాయాన్ని ఎదురించడంలో, అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపడంలో వెన్ను చూపని ధీరుడు. అత్యంత చిన్న వయస్సులో రాజకీయ పాఠాలను నేర్చిన ఘన చరిత్ర. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం, దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన ఘనత ఇప్పటికే మీకు ఆర్థం అయిపోయి ఉంటుంది ఆయన ఎవరో..! అవును మీ మనసులో ఎవరితే ఉన్నారో ఆయనే ఆయన. వారు మరెవరో కాదు పరిటాల రవి.
ఈ పేరు వింటేనే శత్రువుల గుండాలు సగం జారిపోతాయి. ఈ పేరు వింటేనే ప్రతిపక్షం గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఆయన వార్ మొదలుపెడితే ఆ వార్ వన్ సైడ్ అయిపోతుంది. ఆ సమస్య ఎలాంటిదైనా టీ తాగే సమయంలో దాన్ని పరిష్కరించే నేర్పు ఆయన సొంతం. అంతటి రాజకీయ ఓర్పు, నేర్పు కలిగన వ్యక్తి మన పరిటాల రవి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ ను సైతం మంత్ర ముగ్ధుల్ని చేసిన ఆయన శైలి అత్యద్భుతం. తెలుగుదేశం తొలి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అంతటి పాత్రను పోషించింది పరిటాల రావే. ఆయన్ని ఎన్నో మంత్రిపదవులు వరించాయి. ఆయన రాజకీయాల్లో చేరి ప్రజల పాలిట ప్రత్యక్ష దైవంగా మారాడు.
కానీ.. కుళ్లు, కుతంత్రాలతో నిండిన రాజకీయాలు ఆయన్ని పొట్టన బెట్టుకున్నాయి. ఆ తర్వాత ఆయన భార్య పరిటాల సునీత భర్త అడుగుజాడల్లో నడవాలని రాజకీయ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆవిడకి ఒక తనయుడు ఉన్నాడు ఆయనే పరిటాల శ్రీరామ్. ఆయన ఇప్పుడు యుక్తవయస్సుకు చేరుకున్నాడు. ఆయన కూడా తఃన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనే సంకల్పంతో రాజకీయ అరంగేట్రం చేయడానికి సమాయత్తమవుతున్నారు. దీనికి పరిటాల సునీత ప్రోద్భలం తోడవ్వడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం కుదిరింది.
పరిటాల రవి రాజకీయంలో ఉన్న సమయంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జరిపి ప్రజల ఆదరాభిమానాలను సైతం చూరగొనేది. ఆయన జరిపిన ఎన్నో కార్యక్రమాలకు సైతం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం హాజరు అయ్యేవారు. ఇప్పుడు అదే బాటలో తన తనయుడు శ్రీరామ్ సైతం పయనించాలనుకుంటున్నారు.
రిటాల రవి సతీమణి, శ్రీరామ్ తల్లి మంత్రి సునీత సహకారంతో చేపట్టబోతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21న ఏర్పాటుకానున్న ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి. కరువు పరిస్థితుల కారణంగా అనంతపురం జిల్లాలో కూతుళ్ల పెళ్లిళ్లు చేయడం పేద తల్లిదండ్రులకు భారంగానే మారింది. ఈ నేపథ్యంలో అనేక మంది సామూహిక వివాహాల కోసం తమ పేర్లను నమోదు చేసుకొంటున్నారు.
పెద్దల అంగీకారంతో సజావుగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో జంటకు 10వేల రూపాయల ఖర్చుతో చీర, తాళిబొట్టు, ఇతర సామాగ్రిని పరిటాల శ్రీరామ్ సమకూర్చుతున్నారు. పెళ్లికొడుకుల కోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా దుస్తులు తెప్పిస్తున్నారు. ధర్మవరంలో 10టన్నుల లడ్డూలకి కూడా ఆర్డర్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, జిల్లాలో పరిటాల శ్రీరామ్ ఎదుగుదలను కొందరు తెలుగుదేశం నేతలు అడ్డుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సేవా కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రికి ఆయన దగ్గరవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. అంతేగాక, సీఎం తనయుడు లోకేశ్‌కు కూడా టచ్‌లో ఉంటున్నట్లు తెలిసింది. పరిటాల సునీత సైతం అన్ని కార్యక్రమాలకు కొడుకుని ముందుంచి నడిపిస్తున్నారట.
No comments:
Post a Comment