Search This Blog

1 September 2017

చలించిన శ్రీ రామ్…


మరో సంచలన నిర్ణయం....
"నేను ఆడపుట్టుక పుట్టి, వయస్సులో ఉండి ఉంటే నా బిడ్డనెందుకు పంపుతానయ్యా…ఆదేదో నేనే వెళ్లి పడుకునేవాడిని…" అంటూ కళ్ల వెంబడి ఉబికివస్తున్న నీటికి తన భుజం మీద వున్న తువ్వాలు అడ్డుపెట్టుకుని విలపిస్తే ఏ మనసు కరగదు చెప్పండి…అందులోను ఆడబిడ్డలకు హాని కల్గితే మరిగిపోయే రక్తం నింపుకున్న పరిటాల కుటుంబం ఊరకుంటుందా…ప్రాణం పోతుందన్నా వెనుకడుగేయరు…అనంత జిల్లాలో కళ్లలో నీళ్లు తిరిగే సంఘటన పరిటాల శ్రీరామ్ కి ఎదురైంది. అంతే పరిటాల శ్రీరామ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు…అటువంటి గ్రామాలెక్కడున్నాయ్ ఎన్ని కుటుంబాల్లో ఈ కష్టాలున్నాయ్…ఇంకా పొట్టకూటికోసం అటువైపు వెళ్ల డానికి సిద్ధపడ్డవారెవ్వరు…తదితర అంశాలపై విచారణకు తన బృందాలను రంగంలోకి దింపాడు…మొత్తం వివరాలు సేకరించి ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకుని పరిటాల రవీంద్ర జయంతి రోజున రంగంలోకి దిగాడు శ్రీరామ్…ఆ గ్రామం అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం గాజులవారిపల్లి…ఒకప్పుడు మహిళల మాన ప్రాణాలను కొందరు అపరకీచకులు దోచుకుంటుంటే వారి పీచమనిచి పరిటాల రవీంద్ర ప్రజల హృదయాల్లో నిలిచి పోయాడు…ఆ విషయం ధర్మవరంలో ఏవీధిని అడిగినా చెబుతుంది…నాడు మానం దోచుకునే కిచకులకు పరిటాల రవీంద్ర అడ్డుకట్టవేసి ఆడబిడ్డలకురక్షణగా నిలిచాడు .నేడు తమ కన్నీళ్లను అమ్ముకుంటున్న మహిళలకు అండగా తన తండ్రి 60వజయంతిరోజున శ్రీకారం చుట్టి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. ఈ వ్యవహారం జిల్లాలోనే కాదు పలు వర్గాల్లో సంచలనంగా మారింది…సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంతోపాటు తండ్రిబాట వీడని తనయుడిగా శ్రీరామ్ ని పలువురు కొనియాడుతున్నారు.గాజులవారిపల్లి తాండాను ఆదర్శగ్రామంగా తీర్చి దిద్దడానికి ఆగ్రామంలోని పేద కుటుంబాలకు జీవనోపాధికోసం వారు కోరిన విధంగా గ్రామస్థులకు ఉపాధి కోసం పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవలందించడానికి పరిటాల శ్రీరామ్ అడుగేయడం పట్ల గ్రామీణ ప్రాంతాల్లో హర్షం వ్యక్తం అవుతోంది

2 July 2017

PARITALA

Ravinuthala Village

నన్ను చంపతావని తెలుసు. చంపరా పిరికిపందా! ఓ మనిషిని చంపబోతున్నావు అంతే కదా ” అని గర్జించాడతను....
మోకాళ్లలో రెండూ, చాతీలో రెండు, పక్కటెముకల్లో రెండు, గుండెలో ఒకటీ మొత్తం ఏడు బుల్లెట్లు శరీరంలో దిగబడటం వల్ల మరణం సంభవించిందని అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలిపింది. ******
నేటికీ తెలుగుయువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...పరిటాలరవి అన్న రూపం.
నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరానికి నేటికీ ఆదర్శం.
ఎకడచుసినా నీ రూపం...
ఏ కీ చైన్ చూసినా, టీ షార్ట్ చూసినా .....
మరో వైపు నీ రూపం శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది...
నువ్వందించిన స్ఫూర్తి
ఆచరణలో నీవు చూపిన తెగువ
నేటికీ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...
రవి రాయలసీమ విప్లవకారుడు. రాజకీయ నాయకుడు. ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ నీ వ్యతిరేకించాడు. NTR,చంద్రబాబు ప్రభుత్వం లో NTR,చంద్రబాబు తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.
జనవరి 24 మద్యాహ్నం 2:10 నిముషాలకు, Anantapur అనంతపూర్ లో పోరాటయోధుడు పరిటాల రావి హత్య జరిగింది.
మరణం దేహానికే కానీ ఆలోచనలకు కాదని చరిత్ర నిరూపించింది.
పరిటాల రావి మరణించి 12 సం,,నిండాయి. దేశదేశాల విప్లవకారులు, రాజకీయవిశ్లేషకులు అతని గురించి ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. అనుకూలంగానో, వ్యతిరేకంగానో.
గొప్ప రాజకీయవేత్త, మేధావి, దుస్సాహసికుడు, నిజాయితీకల విప్లవకారుడు, ఒంటెత్తు తత్వమనిషి, ఆదర్శవంతమైన నాయకుడు, స్వాప్నికుడు, ప్రేమికుడు – అంటూ ఎవరికి తోచినట్లుగా వాళ్లు నిర్వచిస్తూనే ఉన్నారు.
రవి జీవితంలోని సమకాలీన ప్రాధాన్యతను ఖాదర్ మొహిద్దీన్ గారు రచించిన అస్తమించని రవి అనే పుస్తకం మనముందుకు తెస్తుంది.
రాయలసీమ విప్లవోద్యమంలో కార్యకర్తగా అడుగుపెట్టి, NTR,చంద్రబాబు కు కుడి భుజంగా మెసలి, విముక్త రాయలసీమ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్రవహించి, YSR ప్రభుత్వ దుర్మార్గానికి అసువులు బాసిన అమరవీరుడు పరిటాలరవి. ఆయన తన జీవితమంతా ఫ్యాక్షన్ మీద రాజీ లేని పోరాటాన్ని సాగించాడు. జీవితానికీ మరణానికీ సార్ధకత ఉండాలని తపించిన అచ్చమైన మనిషి. మార్పు జీవితమంత విశాలమైనది అని చెప్పిన విప్లవకారుడు.
ఫ్యాక్షన్ మానవజాతిని రెండు పరస్పర వ్యతిరేక వర్గాలుగా విభజించే దిశగా వెళితే, నేను సామాన్యులుండే వర్గం తరపునే నిలుస్తానని ప్రకటించుకొన్న విశ్వమానవుడు.
పరిటాలరవి జీవితమంతా ఫ్యాక్షన్ సామ్రాజ్యవాద శక్తులతో జరిపిన పోరాటాలమయం. తన మార్గం అనితర సాధ్యం అనిపించేలా జీవించిన ఒక గెరిల్లా యోధుడు ఇతను. తెలుగుదేశం పార్టీ విజయానంతరం లభించిన మంత్రి పదవీ ని స్వచ్ఛందంగా వొదులుకొని మరిన్ని ఇతర ఫ్యాక్షన్ ప్రాంతాలను విముక్తం చేయాలని మరలా పోరాట మార్గన పయనించిన గొప్ప ధీశాలి. ఆ ప్రయత్నంలో YSR ప్రభుత్వచేతుల్లో హత్యచేయబడ్డాడు.
ఏమిటీ మనిషి? ఎందుకలా ప్రవర్తించాడు? ఇతనికేంకావాలి? సుఖమైన జీవితాన్ని వొదిలిపెట్టి ఎందుకలా ప్రాణాలకు తెగించి పోరాడాడు? ఒక మనిషిని శృంఖలాలనుంచి విముక్తుడిని చేయటానికి మరో మనిషిపై తుపాకి గురిపెట్టాలా? అన్న ప్రశ్నలకు చనిపోయే ముందురోజువరకూ రావి వ్రాసుకొన్న డైరీలలో కొన్ని సమాధానాలు దొరుకుతాయి. ఇతని నిబద్దత, రాజకీయ అవగాహనా, పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్ర్ర్యాలను అందించాలన్న తపన వాటి ప్రతీ పేజీలో కనిపిస్తాయి. మార్పు తీసుకురావటానికి చే పరిటాల రవి ఎంచుకొన్న విధానం హింసాపూరితం కావొచ్చు, కానీ ఇతని నిజాయితీని శంకించలేము.

మన ఊరి నటులు గిరిబాబు,రఘుబాబు గారు ఆలితొ సరదాగా షొ లొ today @9.30



Ravinuthala Village

23 May 2017

Karanam Vs Gottipati

Ravinuthala Village
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో టిడిపి సమన్వయ సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, నారాయణ సమక్షంలోనే గొట్టిపాటి, కరణం వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యే గొట్టిపాటిని కరణం వర్గీయులు తోసేశారు. వేమవరంలో జరిగిన జంట హత్యలకు గొట్టిపాటితో సంబంధం ఉందంటూ కరణం వర్గీయులు రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమావేశంలోకి గొట్టిపాటి రావడానికి అర్హత లేదంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత గొట్టిపాటిని తోసేశారు. తోపులాటలో గొట్టిపాటి చొక్కా చినిగిపోయింది.  దీనిపై స్పందించిన గొట్టిపాటి రవికుమార్ తాను ఎలాంటి హత్యారాజకీయాలకు పాల్పడలేదని చెప్పారు. వేమవరం హత్యలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, తప్పని తేలితే రాజకీయాలనుంచి తప్పుకుంటానని గొట్టిపాటి చెప్పారు. బలరాం వర్గీయులు ప్రతిసారీ ఇలాగే చేస్తున్నారని గతంలో మహానాడులోనూ అడ్డుకునే యత్నం చేశారని చెప్పారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేది ఎవరో సిఎంకు తెలుసని, అన్నీ చంద్రబాబు చూసుకుంటారని గొట్టిపాటి చెప్పారు. గొడవ జరుగుతున్న సమయంలో మంత్రి పరిటాల సునీత తనను పక్కకు తీసుకెళ్లారని గొట్టిపాటి తెలిపారు. మంత్రుల సమక్షంలోనే కరణం వర్గీయులు రభస చేశారని గొట్టిపాటి ఆరోపించారు. తనది సర్దుకుపోయే మనస్తత్వమని గొట్టిపాటి గుర్తు చేశారు. మరోవైపు బాహాబాహీకి దిగిన ఇరువర్గాల కార్యకర్తలకు సర్దిచెప్పలేక మంత్రులు నారాయణ, పరిటాల సునీత, మాజీమంత్రి రావెలకు తలప్రాణం తోకకొచ్చింది. బాహాబాహీకి సంబంధించి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు గొట్టిపాటి విజయవాడకు బయలుదేరారు.    

BALARAMKRISHNAMURTHY INTERVIEW WITH IDREAM



Ravinuthala Village

BALARAMKRISHNAMURTHY INTERVIEW WITH IDREAM



Ravinuthala Village

karanam balaram on vemavaram issue fires on gottipati



Ravinuthala Village

17 May 2017

Sitting and previous MLAs from Addanki Assembly Constituency Exclusively......

Ravinuthala Village Year,A. C. No,Assembly Constituency Name,Type of A.C,Winner,Candidates Name,Gender,Party,Votes,Runner UP,Gender,Party,Votes 2014 224 Addanki GEN Gottipati Ravikumar (Bujji) Male YSRC 99537 Venkatesh Karanam Male TDP 95302 2009 224 Addanki GEN Gottipati Ravikumar M INC 86035 Karanam Bala Rama Krishna Murthy M TDP 70271 2004 114 Addanki GEN Karanam Balarama Krishna Murthy M TDP 56356 Jagarlamudi Raghava Rao M INC 53566 1999 114 Addanki GEN Chenchu Garataiah Bachina M TDP 53670 Jagarlamudi Raghava Rao M INC 53421 1994 114 Addanki GEN Chenchugarataiah Bachina M IND 50757 Raghavarao Jagarlamudi M INC 43708 1989 114 Addanki GEN Raghavarao Jagarlamudi M INC 54521 Chenchu Garataiah Bvachina M TDP 47439 1985 114 Addanki GEN Chenchu Garataiah Bacina M TDP 47813 Jagarlamudi Hanumaiah M INC 42253 1983 114 Addanki GEN Bachina Chenchu Garataiah M IND 41068 Karanam Balaramakrishna Murthy M INC 37674 1978 114 Addanki GEN Karanam Balaramakrishna Murthy M INC(I) 36312 Chenchugarataiaha Bachina M JNP 31162 1972 113 Addanki GEN Dasari Prakasam M INC 28914 Narra Subba Rao M IND 19832 1967 103 Addanki GEN P. Dasari M INC 27517 V. Nagineni M SWA 25449 1962 117 Addanki GEN Patibandla Ranganayakulu M CPI 18356 Pachina Apparao M INC 14584 1955 102 Addanki GEN Nagineni Vnakaiah M KLP 21870 Patbandla Ranganayukulu M CPI 15042

balaram oaths as MLC



బలరాం గారి ప్రమాణా స్వీకారం

Face to Face with Karanam Balaram - Mukha Mukhi - TV9



ముఖా ముఖి లొ బలరాం గారు

Karanam balaram interview with talking politics



Ravinuthala Village

11 March 2017

Ravinuthala Village From 29th onwards tiger will ready to roar

3 March 2017

అసెంబ్లి

Ravinuthala Village 192 రోజుల్లో నిర్మాణం పూర్తి చేయడం రికార్డ్‌: కోడెల!!! చట్టసభలకు నవ్యాంధ్రలో నాంది పలుకుతున్నామని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులను అభినందిస్తున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణంలో రైతుల పాత్ర మరువలేనిదన్నారు. 192 రోజుల్లో భవనాల నిర్మాణం పూర్తి చేయడం రికార్డ్‌ సృష్టించిందని అన్నారు. సీఆర్డీఏ, ఎల్‌అండ్‌టీ వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. మనగడ్డపై సభ నిర్వహించుకోవడం గర్వకారణమని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మేం కృషి చేస్తామని అన్నారు. ఈనెల 6 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయని ఈ సంధర్భంగా తెలిపారు. రాజకీయ లబ్దికోసం చట్టసభలను ఉపయోగించుకోవద్దు: యనమల!!! ప్రజల మనోభావాలకు అనుగుణంగా చర్చలు జరగాలని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.పార్టీల వ్యక్తిగత వ్యవహారాలపై చర్చలు సరికాదని ఆయన అన్నారు. రాజకీయ లబ్దికోసం చట్టసభలను ఉపయోగించుకోవద్దని అన్నారు. ప్రతిపక్షాలు ఈ కార్యక్రమానికి హాజరైతే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలు చర్చించే వేదికగా చట్ట సభలు నిలవాలని అందుకు అందరం కట్టుబడి పని చేద్దామని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన ప్రాంతం అమరావతి అని అన్నారు. దక్షిణాసియా దేశాలకు వాణిజ్య పట్టణం అమరావతి ఆయన గుర్తుచేశారు. అసెంబ్లీని అత్యంత వేగంగా నిర్మించాం: మంత్రి నారాయణ!!! ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీని అత్యంత వేగంగా నిర్మించామని, చంద్రబాబు దిశా నిర్దేశంతో...రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూడా అంతే వేగంతో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. గురువారం శాసనసభ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాజధాని భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని అన్నారు. రాజధానికి భూములిచ్చి రైతులు త్యాగం చేస్తే..అడ్డుకునేందుకు కొందరు కుట్రలు పన్నారని మంత్రి నారాయణ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రైతులు పండించిన పంటలను కూడా తగులబెట్టారని నారాయణ మండిపడ్డారు.

మెరిసిన మిణుగురులు

Ravinuthala Village మన రావినూతల అందగాడు రఘు బాబు గారు నంది అవార్దు గెలుచుకున్న సందర్బంగా శుభాభినందనలు