Search This Blog

23 May 2017

Karanam Vs Gottipati

Ravinuthala Village
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో టిడిపి సమన్వయ సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, నారాయణ సమక్షంలోనే గొట్టిపాటి, కరణం వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యే గొట్టిపాటిని కరణం వర్గీయులు తోసేశారు. వేమవరంలో జరిగిన జంట హత్యలకు గొట్టిపాటితో సంబంధం ఉందంటూ కరణం వర్గీయులు రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమావేశంలోకి గొట్టిపాటి రావడానికి అర్హత లేదంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత గొట్టిపాటిని తోసేశారు. తోపులాటలో గొట్టిపాటి చొక్కా చినిగిపోయింది.  దీనిపై స్పందించిన గొట్టిపాటి రవికుమార్ తాను ఎలాంటి హత్యారాజకీయాలకు పాల్పడలేదని చెప్పారు. వేమవరం హత్యలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, తప్పని తేలితే రాజకీయాలనుంచి తప్పుకుంటానని గొట్టిపాటి చెప్పారు. బలరాం వర్గీయులు ప్రతిసారీ ఇలాగే చేస్తున్నారని గతంలో మహానాడులోనూ అడ్డుకునే యత్నం చేశారని చెప్పారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేది ఎవరో సిఎంకు తెలుసని, అన్నీ చంద్రబాబు చూసుకుంటారని గొట్టిపాటి చెప్పారు. గొడవ జరుగుతున్న సమయంలో మంత్రి పరిటాల సునీత తనను పక్కకు తీసుకెళ్లారని గొట్టిపాటి తెలిపారు. మంత్రుల సమక్షంలోనే కరణం వర్గీయులు రభస చేశారని గొట్టిపాటి ఆరోపించారు. తనది సర్దుకుపోయే మనస్తత్వమని గొట్టిపాటి గుర్తు చేశారు. మరోవైపు బాహాబాహీకి దిగిన ఇరువర్గాల కార్యకర్తలకు సర్దిచెప్పలేక మంత్రులు నారాయణ, పరిటాల సునీత, మాజీమంత్రి రావెలకు తలప్రాణం తోకకొచ్చింది. బాహాబాహీకి సంబంధించి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు గొట్టిపాటి విజయవాడకు బయలుదేరారు.    

No comments: