Search This Blog

14 October 2016

RAVINUTHALA:
తెలుగుదేశం పార్టీ నేతలు గొట్టిపాటి రవి కుమార్, కరణం బలరాంల మధ్య బుధవారం నాడు మరోసారి విభేదాలు తలెత్తాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే గొట్టిపాటి కొద్ది రోజుల క్రితం టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
బుధవారం ఉదయం బల్లికురవలోని ఎండీవో కార్యాలయం వద్ద కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు అధికారులు పింఛన్లు మంజూరు చేశారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే కరణం, ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఆ సమయంలో ఇరువురు నేతలు కూడా అక్కడే ఉన్నారు. తమ వారికి పింఛన్లు ఇవ్వడం లేదని గొట్టిపాటి వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో గొట్టిపాటి.. కరణంతో వాగ్వాదానికి దిగారు. గొట్టిపాటి అక్కడి నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు. అధికారుల తీరును తాను సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని హెచ్చరించారు.
రెండు నెలల క్రితం కూడా వీరిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమారు.. అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను ఆదివారం ఉదయానికి బదిలీ చేయిస్తే.. అదే రోజు సాయంత్రానికే ఆ బదిలీని కరణం బలరాం నిలిపివేయించినట్లుగా వార్తలు వచ్చాయి.
అధికార పార్టీలోని ఇరువర్గాల గొడవ అధిష్టానం వరకు వెళ్లింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు, పాత టిడిపి నేతలకు మధ్య పలు నియోజకవర్గాల్లో పొసగడం లేదు. ఇది చంద్రబాబుకు చిక్కులు తెస్తోందని అంటున్నారు.

26 July 2016

గొట్టిపాటి మీద BTF అధినెత వ్యాక్యలు

Ravinuthala Village


VEERA KANAKAMEDALA


ఇలాంటి వ్యక్తి మన పార్టీ లో ఉంటే పార్టీ కి ఎక్కువ నష్టం.. అధ్యక్షుల వారు దయచేసి గమనించాలి
- జనం అంటే తన వర్గం మనుషులే అంట, వాళ్ళ కోసమే పార్టీ మారాడు అంట
- కరణం బలరాం గారి పేరు కూడా మాట్లాడటానికి ఇష్టపడడు అంట,
- అద్దంకి సీట్ వచ్చే ఎలక్షన్స్ లో తనకే వస్తది అని చెప్తున్నాడు
- పార్టీ లోకి రాగానే అధికారులకి బెదిరింపులు స్టార్ట్ చేసాడు
- Tv9 వాళ్ళు ఇతని నేర చరిత్ర మొత్తం లిస్ట్ ఆధారాలతో చూపిస్తే అన్నీ కేవలం ఆరోపణలు అంటున్నాడు

పార్టీలోకి కేవలం వ్యక్తిగత స్వార్థం తో వచ్చిన వ్యక్తి ఇంతలా పెట్రేగిపోవటం మన కార్యకర్తల కర్మ, YS నా దేవుడు అని చెప్పుకు తిరిగిన వ్యక్తి ఇవ్వాళ మన పార్టీ నాయకుల పైన రెచ్చిపోవటం..
పరిటాల రవన్న హత్య తరువాత, టీడీపీ నాయకులు చాలా మంది వై.ఎస్ కి బయపడి సైలెంట్ అయిపోయినా "కరణం బలరాం" గారు అసెంబ్లీ లోపల, బయట ధైర్యంగా పోరాడారు ,
ఆయన ముందు ఈ వ్యక్తి ఇప్పుడు కుప్పి గంతులు వేస్తున్నాడు,
పిల్లి ఎంత బలిసినా పులి కాదు, కాలేదు
ravinuthala village map
ravinuthala

మా భూమి

Ravinuthala Village

తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరియు పట్టాదారులు తమ భూమి వివరాలను నేరుగా తెలుసుకొండి...


 రజలు మరియు పట్టాదారులు తమ భూమి వివరాలను నేరుగా తెలుసుకునేందుకు వీలుగా ఈ "మాభూమి" వెబ్ సైట్ రూపొందించబడినది.


ఆంద్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం  అందిస్తున్న వివిధ రకాల ఉచిత సేవాలు

   

 

Here it is link

http://meebhoomi.ap.gov.in/SearchAdangal.aspx

 

 

 


4 July 2016

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తనను మూడో కొడుకుగా చూసుకునేదని కరణం బలరాం చెప్పారు. నాటి విషయాలను ప్రస్తావించగా ఆయన మాట్లాడుతూ,‘1978లో ఎలక్షన్ టూర్ నిమిత్తం కర్ణాటక నుంచి ఒంగోలుకు వచ్చింది. ఆమెకు ఏర్పాటు చేసిన డయాస్ కూలిపోయింది. మాజీ ప్రధానిగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమెకు సరైన భద్రత కల్పించలేదు. ఒక్క పోలీసోడు కూడా లేడు. ఆ రోజుల్లో ఉన్న నాయకులు ఆమెను ఏదో ఒక విధంగా ఇన్ సల్ట్ చేయాలని చెప్పి, ఆమెకు సెక్యూరిటీ లేకుండా చేశారు. అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న నేను స్వయంగా కారు నడుపుతూ ఆమెను మా జిల్లా దాటించాను. ఇందిరాగాంధీని అలా నేను ప్రొటెక్టు చేసిన తర్వాత ఆమె అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఒకసారి జరిగిన మీటింగ్ లో ‘బలరాం ఈజ్ మై థర్డ్ సన్’ అని ఇందిరాగాంధీ అంది. ఇంతకంటే ఏంకావాలి, వందల, వేల కోట్లు వస్తే ఆ తృప్తి వస్తుందా?’ అని బలరాం ప్రశ్నించారు.

నా చివరి శ్వాస వరకు కార్యకర్తల కొసమె...........కరణం

10tv టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ 1972 నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, 1978లో ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. చంద్రబాబు నాయుడు, కేఈ కృష్ణమూర్తి, తాను కాంగ్రెస్ (ఐ) నుంచి గెలిచామని, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆవుదూడ కాంగ్రెస్ నుంచి, వెంకయ్యనాయుడు జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1978 నుంచి పదవున్నా, లేకపోయినా ప్రజలకు తాను సేవ చేస్తున్నానని చెప్పారు. 10tv టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, మనల్ని కాపాడే కేడర్ ఉన్నప్పుడు వారికేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారిని కాపాడాల్పిన బాధ్యత ఆ పార్టీ నాయకుడికి ఉంటుందని అన్నారు.

30 June 2016

అద్దంకి నియోజకవర్గం

అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, కొరిశపాడు,పంగులూరు మండలాలు అద్దంకి నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. నియోజకవర్గ విస్తీర్ణం 1,006 చదరపు కి.మీ. 104 పంచాయతీలు, 76 ఎంపీటీసీ స్థానాలు, 28 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్లు) ఉన్నాయి.నియోజకవర్గం మీదుగా చెన్నై-కోల్కత్తా జాతీయ రహదారి, నార్కెట్పల్లి- మేదరమెట్ల రాష్ట్రీయ రహదారులువెళ్తున్నాయి. వ్యవసాయం నియోజకవర్గంలో ప్రధానంగా వరి, శనగ, కంది, పత్తి, మొక్కజొన్న,మిర్చి, జూట్, పొగాకు, సుబాబుల్, పశుగ్రాసం, కూరగాయల పంటలు సాగవుతాయి. ఖరీఫ్, రబీల్లో కలిపి సుమారు 1.2 లక్షల ఎకరాల్లో ఈ పంటలు సాగు చేస్తారు. ఈ పంటల ద్వారా వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల విలువ సుమారు 300 కోట్లరూపాయలు ఉంటుంది. సాధారణ వర్షపాతం 804.4 మి.మీ. నమోదవుతుంది. సాగు యోగ్యమైన భూమి 79,982 ఎకరాలు కాగా సాగుకు అనువు కాని భూమి మరో 30 వేల ఎకరాలు ఉంటుంది. సాగు భూమి 55,292 కమతాలుగా ఉంది. సుమారు 50 వేల ఎకరాల భూమికి సాగునీటి వసతి ఉంది. ఈ సాగు భూమి నాగార్జునసాగర్ ఏబీసీ ఆయకట్టు కింద సుమారు 50వేల ఎకరాలు, చెరువులు, ఎత్తిపోతల పథకాల కింద ఉంది. నియోజకవర్గంలో యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే మరో 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పర్యాటక కేంద్రాలు నియోజకవర్గంలో పేరొందిన పర్యాటక కేంద్రాలు ఏమీ లేవు. ప్రసిద్ధ దర్శనీయ క్షేత్రం శింగరకొండ పర్యాటక కేంద్రంగా ఇపుడిపుడే అభివృద్ధిని సాధిస్తోంది. శింగరకొండ, మణికేశ్వరం, రామకూరును పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. భవనాశి చరిత్ర శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం సమీపంలో సుమారు 750 ఎకరాల విస్తీర్ణంలో భవనాశి చెరువు విస్తరించి ఉంది. చెరువు కింది ఏడు వేల ఎకరాలు ఆయకట్టు సాగవుతోంది. 200 ఏళ్ల కిందట భవనాశి సరస్సుగా ఉన్న ఈ చెరువుకు 1919లో అడ్డుకట్ట కట్టడంతో చెరువుగా రూపాంతరం చెందింది. చెరువును రూ.27 కోట్ల వ్యయంతో శాశ్వత రిజర్వాయర్గా అభివృద్ధి చేస్తున్నారు. శాశ్వత రిజర్వాయరుగా ప్రస్తుత స్థిరీకరణ ఆయకట్టుతో పాటు మరో 5వేల ఎకరాలకు అదనంగా మొత్తం 12 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని అంచనా. చెరువు మధ్యలో ఐలాండ్ ఏర్పాటు చేసి బోట్షికారు ద్వారా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. వర్షాధారమైన ఈచెరువులో ఏడాది పొడవునా పుష్కలంగా నీరు నిల్వ ఉండేలా కనకొండ సమీపంలోని గుండ్లకమ్మ నది నుంచి కాలువ ద్వారా చెరువుకు నీరు చేర్చే పనులు కొనసాగుతున్నాయి.

18 May 2016

తండ్రి భాట లొ తనయుడు

అస్తమించని రవీంద్రుడి వారసుడు అతను...రాష్ట్ర మంత్రి పరిటాల సునితమ్మ తనయుడు...అనంతలోనే కాదు ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులు ఆయన సొంతం...పరిటాల అభిమానుల ఆశాదీపమతను..తండ్రి బాట వీడని శ్రీరాముడు...ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే....రాప్తాడులో జరిగిన మినీ మహనాడులో శ్రీరాముడి శైలి తండ్రి పరిటాల రవీంద్రుడిని తలపించింది...సామాన్యకార్యకర్తలా వెనుక వరుసలో కూర్చుని అత్యంత నిరాడంబరంగా పెద్దల ఉపన్యాసాలను వింటూ క్రమశిక్షణ అంటే ఏమిటో యువతకు పరోక్షసంకేతాలు ఇచ్చాడనిపించింది...తండ్రి రవీంద్రుడి అశయాలే తన ఊపిరిగా ఆడబిడ్డల అన్నగా నేనున్నానని నిరూపించుకున్నాడు.....చిన్నపాటి అధికారం వుంటే చాలు విర్రవీగే నేటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను కల్గి వున్న ఈ యువనాయకుడు నిజంగా యువతకు స్ఫూర్తి దాయకుడే....


26 April 2016

gottipati entry to TDP will not digistive to KARANAM

గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం లోకి రావడానికి అంత సిద్దం అయినది .
రాష్ట్ర స్థాయి పాలసి లో భాగం గా తెలుగుదేశం లో చేరాలనుకునే వై కా పా యం ఎల్ ఏ లను స్వాగతించక తప్పని స్థితి తెలుగుదేశం కార్యకర్తలది మండల స్థాయి నాయకులది .తమకు ఇష్టం ఉన్న లేకున్నా జరిగే దాన్ని ఆపలేని నిస్సహాయ స్థితి ఆ నియోజకవర్గ ఇంచార్జీలది.
గొట్టిపాటి ప్రవేశం అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచింది కాబట్టి నిబద్దత కలిగిన కార్యకర్త ల గా నాయకులిగా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు తమ అయిష్టతను లేదా ఇబ్బందిని బయటపెట్టకుండా పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మౌనం గా అంగీకరిస్తున్నారు.
అదే సమయం లో ప్రస్తుతం ఉన్న పని చేస్తున్న ఇంచార్జీ పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు కి భరోసా ఇవ్వాల్సిన అవసరంకూడా ఉంది. గత ఎన్నికల్లో పోరాడి ఆడాడు.
ఓడినా కూడా నిత్యం ప్రజలతో నే తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.ఒక విధం గా నియోజకవర్గం లో పార్టీ పుంజుకున్నది అని వినవస్తున్నది.. అలాంటి స్థితి లో గొట్టిపాటి ని పార్టీ లోకి ఆహ్వానించారు .
తమ ఇష్టైష్టాలు పక్కన పెట్టి వెంకటేష్ కాని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు బలరాం గారు మౌనం గా నే అంగీకరించారు
అధిష్టానం నిర్ణయం పాటించారు
కాని
కార్యకర్తల నుంచి కొన్ని సూటి ప్రశ్నలు వినవస్తున్నాయి
1. మనకు నాయకత్వం ఉన్న చోట పక్క పార్టీ నాయకుడిని ఎందుకు తీసుకుంటున్నారు ?
2. ప్రతిపక్షం లో బలమయిననాయకుడు ఉండకూడదు అని తీసుకుంటున్నారు అని అనుకుందాము అంటే ఇప్పటికే ఇక్కడ బలమయిన నాయకుడి గా ఉన్న వ్యక్తీ ని ఏమి చేస్తారు ?
3 ఇంతకాలం పని చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెంది సొంత పార్టీ నాయకుడికి యువకుడికి పార్టీ చేసే న్యాయం ఏమిటి ?
అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గొట్టిపాటి బలమయిన నాయకుడే కాదనడంలేదు. గొట్టిపాటి వెంకటేష్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం కి చెందినవారే. కాబట్టి గొట్టిపాటి రాకను పార్టీ లో ఎవరు పెద్ద గా వ్యతిరేకిన్చ్డంలేదు .
అదే సమయం లో గత పది ఏళ్ళు గా పార్టీ ని అంటిపెట్టుకొని వెంకటేష్ లాంటి యువకుడికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది
ఇప్పటికి వెంకటేష్ కి ఎటువంటి సూచనలు అందించినట్టు గా కనిపించడం లేదు.
అద్దంకి నియోజకవర్గం మీదే అని గొట్టిపాటికి హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. మరి కరణం పరిస్థితి ఏమిటి ?ఆయన రేపటి నుంచి ఎక్కడ పని చేయాలి ? రాజకీయంగా ఏమి చేయాలి ? అధిష్టానమే ఏదో ఒక మార్గం చూడాల్సిన అవసరం ఉంది. కరణం కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత అధిస్తానిదే అని కార్యకర్తలు కుండ్ అబద్దాలు కొట్టినట్టు చెప్తున్నారు
కడప జిల్లా జమ్మలమడుగు ప్రకాశం జిల్లా అద్దంకి ఈ రెండు కొంచం సంక్లిష్టం అయినవి
ఇద్దరు నేతలు కలసి పనిచేసే వాతావరణం ఉంటె అది పార్టీ కి వ్యక్తులకి ఇద్దరికీ మేలు జరుగుతది.

24 April 2016

GOTTIPATI WILL JOIN TO TDP ON 29TH APRIL


ఏపీలో అధికార పార్టీ టీడీపీలోకి విపక్ష వైసీపీ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ పై విజయం సాధించిన చాంద్ బాషా టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరింది. చాంద్ బాషా కండువా మార్చిన మరుక్షణమే... ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి) కూడా సైకిలెక్కడం ఖరారైపోయింది. ఈ నెల 29న గొట్టిపాటి పార్టీ మార్చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరుతున్నట్లు అటు గొట్టిపాటి వర్గీయులతో పాటు ఇటు టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి.ఇప్పటికె బుజ్జి గ్రామ స్థాయి నేతలతొ చర్చిస్తున్నారు

టిడిపి అదికారం లొకి వచిన తరువాత మొట్ట మొదటి నిర్మాణం రావినూతల లొ

AMARAVATHI

TODAY ADDANKI NEWS

TODAY NEWS


ONE MORE MLA

14 April 2016

దుమ్ము రేపుతున్న చంద్రబాబు.

ఉచ్చ పోసుకుంటున్న ఉద్యోగులు అధికారులు..
ఆటం బాంబు లా ఉంటున్న చంద్రబాబునాయుడు ..
అందుకే ఆయన అడ్మినిస్ట్రేషన్‌ కి అమ్మా మొగుడు అనేదీ.
10:30 కి ఆఫీస్ 11:00 వరకు ఎవరు కనిపించరు 1:00 నుండి 2:00 వరకు లంచ్ బ్రేక్ 3:00 అయినా ఎవ్వరు సీట్లలో కనిపించరు 5:30 వరకు ఆఫీస్ కాని 4:30 కే అందరు బ్యాగ్ లు సర్దేస్తారు.ఎక్కడా?ఏమిటి అనుకుంటున్నారా?అదేనండి విభజన సమయం లో అవసరమయితే ఎక్కువ సమయం కేటాయిస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల తీరు ఇది.ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం సమయ పాలన పై ద్రుష్టి పెట్టింది.
అడిగి మరీ జీతాలు పెంచుకున్న ఉద్యోగులు ఇలా సమయ పాలన పాటించకపోవడం తో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం గా వుంది.ఇందుకోసం తాజా గా ఒక సర్కులర్ కూడా విడుదల చేసింది.ఈ సర్కులర్ ప్రకారం పదిన్నరకల్లా సెక్షన్ ఆఫీసర్ దగ్గర వుండే రిజిస్టర్ లో సంతకం పెట్టాలి.ఒక పది నిముషాలు గ్రేస్ పీరియడ్ వుంటుంది.10:40 కి రిజిస్టర్ డిప్యూటీ సెక్రటరీ లేదా అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారి దగ్గరకి వెళ్తుంది.అక్కడ కూడా 11:30 వరకు మాత్రమే వుంటుంది.ఇలా మూడు సార్లు లేట్ అయితే సిఎల్ లేదా ఈఎల్ కట్ చేస్తారు.ఒకవేళ ఈ రెండు లేక పోతే ఎల్వోపి వేస్తారు.11:30 నుంచి 1:30 లోపు వస్తే హాఫ్ డే లీవ్ గా పరిగణిస్తారు.
ఈ జీవో ని ఖచ్చితం గా పాటించాలని,రిజిస్టర్ లో ల విషయం లో ఖచ్చితం గా వుండాలని ఇటు ఉద్యోగులకు,అటు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారి చేసింది ప్రభుత్వం.చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి పరిపాలన సాగిస్తుండడం తో ఇక్కడ అధికారులది ఆడింది ఆట పాడింది పాట లా వుంది.ఉన్నతాధికారులు మీటింగ్ లకు హైదరాబాద్,విజయవాడ కి తిరుగుతుండటం తో ఒక్క డిప్యుటీ సెక్రటరీ మాత్రమే అందుబాటులో వుంటున్నారు.సర్కులర్ చూసిన ఉద్యోగులు చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత పద్దతుల్లోకి వెళ్ళిపోయారా అని చెవులు కొరుక్కుంటున్నారు.

6 April 2016

ప్రకాశం జిల్లా లొ వలసలు



వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న బలమైన జిల్లాలో ఒకటైన ప్రకాశంజిల్లాలో ఆ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతోంది. ఆ జిల్లాకు సంబంధించిన నలుగురువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. గత సార్వ త్రిక ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు,1ఎంపీ,సీటు సాధించింది.వైసిపికి బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడనున్నట్లు సమాచారం.అధికార టిడిపిలోకి వలస వెళ్లే వారిలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్సంతనూతలపాడు(ఎస్పీ) ఎమ్మెల్యే అదిమూలపు సురేష్మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి,కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వలసలకు సంబంధించి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తో ఇప్పటికే ప్రకాశంజిల్లా టిడిపి అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ మంతనాలు జరిపినట్లు సమా చారం. ఈ ఎమ్మెల్యేల రాకపట్ల ప్రకాశంజిల్లాకు చెందిన టిడిపి నేతలంతా సుముఖంగా  ఉండటంతో ఇక వీరి చేరిక దాదాపు ఖాయమన్నట్లు ప్రచారం సాగుతోంది. వీరిని చేర్చుకొనే విషయంలో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ సైతం తమ సుముఖతను వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశమంది పేరున్న ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటంతో ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి పూడ్చరాని నష్టంవాటిల్లే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

2 April 2016

ravinuthala village water pumping video

అనంతపురం ప్రత్యక్ష రాజాకీయాల లొ శ్రీరాం

అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో దివంగ‌త మాజీ మంత్రి ప‌రిటాల ర‌వీంద్ర కుటుంబానికి ఎలాంటి ఇమేజ్ ఉందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. ర‌వీంద్ర హ‌ఠార్మ‌ర‌ణం త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న స‌తీమ‌ణి సునీత మూడుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించి ఇప్పుడు బాబు కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సునీత త‌న‌యుడు శ్రీరామ్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చేందుకు ప‌గ‌డ్బందీ ప్లాన్‌తో వ‌స్తున్నాడు.

ప్ర‌జ‌ల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు శ్రీరామ్ త‌న తండ్రి బాట‌లోనే ప‌య‌నిస్తున్నాడు. పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్ గొడవల్లో తలమున‌క‌లై ఉన్న సమయంలో పేదల కోసం ఉచిత సామూహిక వివాహాలను చేయాలని సంకల్పించారు. ఒకేసారి వేలాది మందికి సామూహిక వివాహాలు ర‌వి ఆధ్వ‌ర్యంలో జ‌రిగేవి. అలా ఆయ‌న ఎంతోమంది గుండెల్లో స్థిర‌స్థాయిగా చోటు సంపాదించుకున్నారు. రవీంద్ర హత్యానంతరం కొంతకాలం ఈ సంప్రదాయానికి బ్రేక్‌పడింది. అయితే ఇప్పుడు ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్‌ ముందుకొచ్చారు.
శ్రీరామ్ ఆధ్వ‌ర్యంలో ఏప్రిల్ 21న ఏర్పాటుకానున్న ఈ వేడుకకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు. అయితే ఇది శ్రీ‌రామ్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు కూడా ఉప‌క‌రిస్తుంద‌ని చెబుతున్నారు. ఇక జిల్లాలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కే కాదు టీడీపీలో కూడా ర‌వి ఫ్యామిలీ ముఖ్యంగా సునీత‌, శ్రీరామ్ అంటే ప‌డని ప్ర‌త్య‌ర్థులు సైతం శ్రీరామ్ పొలిటిక‌ల్‌గా ఎదిగేందుకు వేస్తోన్న ఎత్తులు చూసి షాక‌వుతున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ కోసం శ్రీరామ్ చంద్రబాబుతో పాటు లోకేష్‌,కరణం వెంకటెష్,రామొహన్ నాయుడు లాంటి యువ నాయుకుల తొ సైతం ట‌చ్‌లో ఉంటున్నార‌ని టాక్‌. రాప్తాడు లేదా పెనుగొండ‌ల‌లో ఎక్క‌డో ఓ చోట నుంచి శ్రీరామ్ బ‌రిలో ఉండే ఛాన్సులున్నాయి.

31 March 2016

తండ్రి ఆశయ సాదనె లక్ష్యం గా ముందుకు సాగుతున్న పరిటాల శ్రీరాం


అప్పుడు రాయలసీమ పగలతో, ప్రతీకారాలతో అణు నిత్యం రణరంగాన్ని తలపించేంది. వర్గ పోరు, రాజకీయ కొట్లాటలు అక్కడ సర్వసాధారణం. అలాంటి సమయంలో ప్రజల పాలిత దైవం లా వచ్చాడు. ప్రజలను క్షోభకు గురిచేసే వారిపట్ల ఉప్పెనలా దూకాడు. ప్రజల కష్టాలను తీర్చే మనసు, సామాజిక సమస్యలపై సంపూర్ణ అవగాహన, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకువచ్చే సేవాగుణం ఆయన సొంతం. అన్యాయాన్ని ఎదురించడంలో, అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపడంలో వెన్ను చూపని ధీరుడు. అత్యంత చిన్న వయస్సులో రాజకీయ పాఠాలను నేర్చిన ఘన చరిత్ర. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం, దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన ఘనత ఇప్పటికే మీకు ఆర్థం అయిపోయి ఉంటుంది ఆయన ఎవరో..! అవును మీ మనసులో ఎవరితే ఉన్నారో ఆయనే ఆయన. వారు మరెవరో కాదు పరిటాల రవి.

ఈ పేరు వింటేనే శత్రువుల గుండాలు సగం జారిపోతాయి. ఈ పేరు వింటేనే ప్రతిపక్షం గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఆయన వార్ మొదలుపెడితే ఆ వార్ వన్ సైడ్ అయిపోతుంది. ఆ సమస్య ఎలాంటిదైనా టీ తాగే సమయంలో దాన్ని పరిష్కరించే నేర్పు ఆయన సొంతం.  అంతటి రాజకీయ ఓర్పు, నేర్పు కలిగన వ్యక్తి మన పరిటాల రవి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ ను సైతం మంత్ర ముగ్ధుల్ని చేసిన ఆయన శైలి అత్యద్భుతం. తెలుగుదేశం తొలి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అంతటి పాత్రను పోషించింది పరిటాల రావే. ఆయన్ని ఎన్నో మంత్రిపదవులు వరించాయి. ఆయన రాజకీయాల్లో చేరి ప్రజల పాలిట ప్రత్యక్ష దైవంగా మారాడు.

కానీ.. కుళ్లు, కుతంత్రాలతో నిండిన రాజకీయాలు ఆయన్ని పొట్టన బెట్టుకున్నాయి. ఆ తర్వాత ఆయన భార్య పరిటాల సునీత భర్త అడుగుజాడల్లో నడవాలని రాజకీయ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆవిడకి ఒక తనయుడు ఉన్నాడు ఆయనే పరిటాల శ్రీరామ్. ఆయన ఇప్పుడు యుక్తవయస్సుకు చేరుకున్నాడు. ఆయన కూడా తఃన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనే సంకల్పంతో రాజకీయ అరంగేట్రం చేయడానికి సమాయత్తమవుతున్నారు. దీనికి పరిటాల సునీత ప్రోద్భలం తోడవ్వడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం కుదిరింది.


పరిటాల రవి రాజకీయంలో ఉన్న సమయంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జరిపి ప్రజల ఆదరాభిమానాలను సైతం చూరగొనేది. ఆయన జరిపిన ఎన్నో కార్యక్రమాలకు సైతం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం హాజరు అయ్యేవారు. ఇప్పుడు అదే బాటలో తన తనయుడు శ్రీరామ్ సైతం పయనించాలనుకుంటున్నారు.

రిటాల రవి సతీమణి, శ్రీరామ్ తల్లి మంత్రి సునీత సహకారంతో చేపట్టబోతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21న ఏర్పాటుకానున్న ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి. కరువు పరిస్థితుల కారణంగా అనంతపురం జిల్లాలో కూతుళ్ల పెళ్లిళ్లు చేయడం పేద తల్లిదండ్రులకు భారంగానే మారింది. ఈ నేపథ్యంలో అనేక మంది సామూహిక వివాహాల కోసం తమ పేర్లను నమోదు చేసుకొంటున్నారు.

పెద్దల అంగీకారంతో సజావుగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో జంటకు 10వేల రూపాయల ఖర్చుతో చీర, తాళిబొట్టు, ఇతర సామాగ్రిని పరిటాల శ్రీరామ్‌ సమకూర్చుతున్నారు. పెళ్లికొడుకుల కోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా దుస్తులు తెప్పిస్తున్నారు. ధర్మవరంలో 10టన్నుల లడ్డూలకి కూడా ఆర్డర్‌ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, జిల్లాలో పరిటాల శ్రీరామ్‌ ఎదుగుదలను కొందరు తెలుగుదేశం నేతలు అడ్డుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సేవా కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రికి ఆయన దగ్గరవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. అంతేగాక, సీఎం తనయుడు లోకేశ్‌కు కూడా టచ్‌లో ఉంటున్నట్లు తెలిసింది. పరిటాల సునీత సైతం అన్ని కార్యక్రమాలకు కొడుకుని ముందుంచి నడిపిస్తున్నారట.

పుట్టిన ఊరికొసం రాత్రనక పగలనకా ...!


రావినూతల  గ్రామ ప్రజలు వెసవి లొ నీటి కొరత లెకుండా ఇన్జన్లతొ గ్రామ చెరువులను నింపెస్తున్నారు

ఆ ద్రుశ్యాలు.......

రోజా జూనియర్ గురించి అలా అనడానికి కారణం ఏమిటి..?




వైకాపా నుంచి సంవత్సరం పాటు బహిష్కరణకు గురైన రోజా పిటిషన్ పై హైకోర్ట్ లో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోజా సినినటుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. జూనియర్ 2009లో ప్రచారం కోసం వాడుకున్నారని, జూనియర్ ప్రచారం సమయంలో అభిమానులు, కార్యకర్తలు భారీ తరలి రావడంతో.. జూనియర్ కు ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఎన్నికల అనంతరం ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టిందని రోజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
రోజా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి అని ఒకసారి పరిశీలిస్తే.. ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమైన వ్యక్తి కొడాలి నాని. మొదటి నుంచి నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు నాని వైకాపాలో చేరారు. గుడివాడ నియోజక వర్గం నుంచి నాని విజయం సాధించాడు. దీంతో నానికి, తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇక, ఇటీవలే రోజాతో పాటు నానిని కూడా సభ నుంచి సస్పెండ్ చేసింది అసెంబ్లీ. అయితే, అటు ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీకి ఎలాగో ఎన్టీఆర్ కూడా దూరంగా ఉండటంతో.. ఎన్టీఆర్ ను తనవైపు తిప్పుకోవాలని వైకాపా చూస్తున్నదా అనే అనుమానం కలుగుతున్నది. అటు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండటంతో.. వైకాపాకు కూడా చరిష్మా కలిగిన నేత అవసరం కాబట్టి జూనియర్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలలో భాగంగానే రోజా చేత ఇలా చెప్పించి ఉంటారా అనే అనుమానం కలుగుతున్నది. ఇందులో నిజం ఎంత అన్నది మాత్రం స్పష్టంగా తెలియదు.

29 March 2016

MLA & MLC Salaries Hit A Triple

Telangana Government decided to give a hike in salaries MLAs and MLCs and Telangana legislative affairs minister Harish Rao introduced the respective bill in Assembly on Monday. 


The legislators salaries were proposed to be tripled and they will be getting 2.30 lakh rupees instead of 83,000 rupees according to the new amendment. If the raise in salaries goes an act, then government will be burdened with an extra 42.67 crore rupees annually and Tuesday will witness a discussion on this in Assembly. 

An MLA or MLC at least for once will get a pension of 30,000 rupees and for those who were legislators more than once will get an extra 1000 rupees per month and up to a maximum of 50,000 rupees per month. 

CM's salary will be 2.44 lakh rupees adding all the allowances and ministers can get up to 2.52 lakh rupees. The detailed pay for ministers comprises of 14,000 in basic, 8,000 special allowance, camp office allowance 10,000, bulletproof car allowance 25,000, own car allowance 30,000, fuel allowance 15,000, house rent allowance of 50,000 rupees and others.

REVANTH REDDY Vs KTR



రెండు భిన్నధ్రువాల్లాంటి రాజకీయ నేతల మధ్య మాటలు చాలా తక్కువగా ఉంటాయి. రాజకీయాల్ని కాసేపు పక్కన పెడితే.. ఒకరికొకరు ఎదురెదురు పడినప్పుడు వారు ఎలా ఉంటారు? ఏమని పిలుచుకుంటారు? ఎలా మాట్లాడుకుంటారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్.. తెలంగాణ రాష్ట్ర సర్కారులో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత పవర్ ఫుల్ అయిన మంత్రి కేటీఆర్ లాంటి రెండు భిన్నధ్రువాలు ఒకచోట కలిసినప్పుడు వారి మధ్య ఎలా ఉంటుందన్నది సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకుంది.

అసెంబ్లీ లాబీలో లిఫ్ట్ దగ్గర టీటీడీపీ నేత  రేవంత్ వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి మంత్రి కేటీఆర్ వచ్చారు. రేవంత్ ను చూసిన వెంటనే.. ఏం భయ్యా .. వ్యూహాత్మకంగా వెళుతున్నట్లున్నావే? అంటూ నవ్వుతూ పలుకరించారు. దీనికి ప్రతిగా రియాక్ట్ అయిన రేవంత్.. వెళ్లాలి కదా.. స్ట్రాటజీ లేకపోతే ఎలా అన్నా? అంటూ బదులిచ్చారు. దీంతో కేటీఆర్ నవ్వుతూ రేవంత్ భుజం తట్టి వెళ్లిపోయారు. రాజకీయంగా ఎన్ని తిట్లు తిట్టుకున్నా.. వాదనల సందర్భంగా ఎంతగా విభేదించుకున్నా.. ఒకచోట కలిసినప్పుడు మాత్రం రాజకీయ వైరుధ్యాలకు భిన్నంగా పలుకరించుకోవటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.