వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న బలమైన జిల్లాలో ఒకటైన ప్రకాశంజిల్లాలో ఆ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతోంది. ఆ జిల్లాకు సంబంధించిన నలుగురువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. గత సార్వ త్రిక ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో 6 ఎమ్మెల్యే సీట్లు,1ఎంపీ,సీటు సాధించింది.వైసిపికి బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడనున్నట్లు సమాచారం.అధికార టిడిపిలోకి వలస వెళ్లే వారిలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు(ఎస్పీ) ఎమ్మెల్యే అదిమూలపు సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి,కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వలసలకు సంబంధించి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తో ఇప్పటికే ప్రకాశంజిల్లా టిడిపి అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ మంతనాలు జరిపినట్లు సమా చారం. ఈ ఎమ్మెల్యేల రాకపట్ల ప్రకాశంజిల్లాకు చెందిన టిడిపి నేతలంతా సుముఖంగా ఉండటంతో ఇక వీరి చేరిక దాదాపు ఖాయమన్నట్లు ప్రచారం సాగుతోంది. వీరిని చేర్చుకొనే విషయంలో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ సైతం తమ సుముఖతను వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశమంది పేరున్న ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటంతో ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి పూడ్చరాని నష్టంవాటిల్లే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


No comments:
Post a Comment