మరో సంచలన నిర్ణయం....
"నేను ఆడపుట్టుక పుట్టి, వయస్సులో ఉండి ఉంటే నా బిడ్డనెందుకు పంపుతానయ్యా…ఆదేదో నేనే వెళ్లి పడుకునేవాడిని…" అంటూ కళ్ల వెంబడి ఉబికివస్తున్న నీటికి తన భుజం మీద వున్న తువ్వాలు అడ్డుపెట్టుకుని విలపిస్తే ఏ మనసు కరగదు చెప్పండి…అందులోను ఆడబిడ్డలకు హాని కల్గితే మరిగిపోయే రక్తం నింపుకున్న పరిటాల కుటుంబం ఊరకుంటుందా…ప్రాణం పోతుందన్నా వెనుకడుగేయరు…అనంత జిల్లాలో కళ్లలో నీళ్లు తిరిగే సంఘటన పరిటాల శ్రీరామ్ కి ఎదురైంది. అంతే పరిటాల శ్రీరామ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు…అటువంటి గ్రామాలెక్కడున్నాయ్ ఎన్ని కుటుంబాల్లో ఈ కష్టాలున్నాయ్…ఇంకా పొట్టకూటికోసం అటువైపు వెళ్ల డానికి సిద్ధపడ్డవారెవ్వరు…తదితర అంశాలపై విచారణకు తన బృందాలను రంగంలోకి దింపాడు…మొత్తం వివరాలు సేకరించి ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకుని పరిటాల రవీంద్ర జయంతి రోజున రంగంలోకి దిగాడు శ్రీరామ్…ఆ గ్రామం అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం గాజులవారిపల్లి…ఒకప్పుడు మహిళల మాన ప్రాణాలను కొందరు అపరకీచకులు దోచుకుంటుంటే వారి పీచమనిచి పరిటాల రవీంద్ర ప్రజల హృదయాల్లో నిలిచి పోయాడు…ఆ విషయం ధర్మవరంలో ఏవీధిని అడిగినా చెబుతుంది…నాడు మానం దోచుకునే కిచకులకు పరిటాల రవీంద్ర అడ్డుకట్టవేసి ఆడబిడ్డలకురక్షణగా నిలిచాడు .నేడు తమ కన్నీళ్లను అమ్ముకుంటున్న మహిళలకు అండగా తన తండ్రి 60వజయంతిరోజున శ్రీకారం చుట్టి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. ఈ వ్యవహారం జిల్లాలోనే కాదు పలు వర్గాల్లో సంచలనంగా మారింది…సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంతోపాటు తండ్రిబాట వీడని తనయుడిగా శ్రీరామ్ ని పలువురు కొనియాడుతున్నారు.గాజులవారిపల్లి తాండాను ఆదర్శగ్రామంగా తీర్చి దిద్దడానికి ఆగ్రామంలోని పేద కుటుంబాలకు జీవనోపాధికోసం వారు కోరిన విధంగా గ్రామస్థులకు ఉపాధి కోసం పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవలందించడానికి పరిటాల శ్రీరామ్ అడుగేయడం పట్ల గ్రామీణ ప్రాంతాల్లో హర్షం వ్యక్తం అవుతోంది
Ravinuthala is a village panchayat located in the Prakasam district of Andhra-Pradesh state,India. The latitude 15.7387275 and longitude 80.0808907 are the geocoordinate of the Ravinuthala. Amaravathi is the state capital for Ravinuthala village. It is located around 129 kilometer away from Ravinuthala.. The other nearest state capital from Ravinuthala is Hyderabad(Telengana state) and its distance is 305 KM. The other surrouning state capitals are Chennai 295.0 KM., Bangalore 409.2 KM.
Search This Blog
1 September 2017
చలించిన శ్రీ రామ్…
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment