Search This Blog

29 March 2016

100 కొట్లా కావల్సిందీ......



రాజకీయాలు చాలా కాస్ట్టీగా మారిపోయాయి. సాధారణ బ్యాక్ గ్రౌండ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారు కూడా కోట్లకు అధిపతులైపోతున్నారు. అసలు కోట్లు సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తున్నవారూ ఉన్నారు. అందుకే ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా.. సీనియర్ అయినా, జూనియర్ అయినా... నోరు విప్పితే చాలు వందల కోట్లు, వేల కోట్ల లెక్కలే వినిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూతో కలిసి టీడీపీలో చేరుతారని భావిస్తున్న రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి తనకు టీడీపీ నేతలు 20 కోట్లు ఇస్తామన్నారని సంచలన ప్రకటన చేశారు. అయినా, తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదన్నారు.

 మరోవైపు విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అంతకంటే పెద్ద పెద్ద మాటలు వినిపిస్తున్నారు. తనకు 100 కోట్లు ఇచ్చినా కూడా వైసీపీని వీడనని ప్రకటించారు. ''టీడీపీ ఎప్పటికైనా మునిగే పడవ. ఆ పార్టీలోకి పోయి ఏం చేయాలి? అలా చేస్తే జనాలు ఛీ కొడతారు'' అని ఈశ్వరి అంటున్నారు. టీడీపీ 'ఆకర్ష'పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నేతలు యత్నించారని, అందుకు వారు రూ.20 కోట్లు ఎరగా వేశారని ఆమె ఆరోపించారు. రూ.20 కోట్లు కాదు కదా, రూ.100 కోట్లిచ్చినా తాము వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. వైసీపీని దెబ్బకొట్టేందుకే టీడీపీ కుట్రలు చేస్తోందిని ఆరోపించారు. గిరిజన బిడ్డలమైన తాము వైఎస్ జగన్ వల్లే అసెంబ్లీలో అడుగుపెట్టగలిగామని ఆమె చెప్పారు. 

 అయితే... ఈ మహిళా ఎమ్మెల్యేల మాటలు విన్న రాజకీయ పండితులు మాత్రం ''ఆడవారి మాటలకు అర్థాలు వేరులే'' అని పాటలు పాడుకుంటున్నారు.

No comments: